విద్యార్థులూ, ఇక పరీక్షలకు సన్నద్ధం కండి!: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి
- గత ఏడాది సాఫ్ట్ వేర్ చెక్ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తింది
- సీజీజీ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించింది
- టెస్టింగ్ విజయవంతంగా పూర్తయింది.. సమస్యలు రాలేదు
సీజీజీ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించిందన్నారు. అంతేకాక, బోర్డులో ఐటీ విభాగం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కూడా పూర్తయిందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక సమస్య రాలేదన్నారు. గ్లోబరీనాపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని ఆయన అన్నారు. విద్యార్థులు అనుమానాలు లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. డేటాలో పొరపాట్లు కనిపిస్తే.. తమ ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలని తెలిపారు.