మార్ఫింగ్ ఫొటో ఎఫెక్ట్.. రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు కేఏ పాల్ కోడలు ఫిర్యాదు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫొటో మార్ఫింగ్
- వర్మపై చర్యలు తీసుకోవాలి.. మార్ఫింగ్ ఫొటోను తొలగించాలి
- సైబర్ క్రైమ్ పోలీసులకు పాల్ కోడలు జ్యోతి ఫిర్యాదు
గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి తాము దిగిన ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి, వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా మార్చారని పేర్కొన్నారు. వర్మ తన ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోను తొలగించాలని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటో మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వర్మ ఐపీ నెంబర్ కోసం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం.