కొత్త కథపై తేజ కసరత్తు .. హీరోగా గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త కథపై తేజ కసరత్తు .. హీరోగా గోపీచంద్

  • తేజ దర్శకత్వంలో విలన్ గా చేసిన గోపీచంద్ 
  • గోపీచంద్ హీరోగా తేజ సినిమా
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
కొంతకాలంగా గోపీచంద్ కి కలిసి రావడం లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ పరాజయాలను చవిచూస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'చాణక్య' కూడా పూర్తిగా నిరాశపరడంతో గోపీచంద్ ఆలోచనలో పడ్డాడు. ఎలాంటి కథ చేస్తే బాగుంటుందా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా, దర్శకుడు తేజ ఒక విభిన్నమైన కథాంశాన్ని వినిపించాడట.

ఆ కథ బాగా నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' .. 'నిజం' సినిమాల్లో గోపీచంద్ విలన్ గా మాత్రమే చేశాడు. తేజతో హీరోగా గోపీచంద్ చేసే తొలి సినిమా ఇదే అవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ .. సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Gopichand
Teja

More Telugu News