లారీలు అడ్డుపెట్టి అత్యాచారం చేశారా..?
Add ap7am to your home Screen

లారీలు అడ్డుపెట్టి అత్యాచారం చేశారా..?

  • స్కూటీ పాడవడంతో భయపడిపోయిన ప్రియాంక రెడ్డి
  • శవమై కనిపించిన లేడీ వెటర్నరీ డాక్టర్
  • లారీ డ్రైవర్లపైనే అనుమానం!
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ దారుణమైన రీతిలో హత్యకు గురైంది. షాద్ నగర్ సమీపంలో ఆమె మృతదేహం దహనమైన స్థితిలో కనిపించింది. హాస్పిటల్ కు వెళ్లిన ఆమె తిరిగి వచ్చే సమయంలో స్కూటీ పాడవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఆ సమయంలో తన చుట్టుపక్కల కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారంటూ తన చెల్లికి చేసిన ఫోన్ కాలే ఆమె చివరి మాటలు! ఆ తర్వాత రోజు ఉదయం ఆమె శవమై కనిపించింది.

ఇది లారీ డ్రైవర్ల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం ఇదే భావనతో ఉన్నారు. లారీలను అడ్డుగా పెట్టి ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, లారీలో ఉన్న వ్యక్తి స్కూటీని బాగు చేయిస్తానని తీసుకెళ్లి షాపు మూసేసి ఉందని మళ్లీ వచ్చాడని, తనకు భయం వేస్తోందని తన సోదరితో చెప్పింది. మొత్తానికి ఆమె వాయిస్ కాల్ ఆధారంగా ఇది లారీ డ్రైవర్ల ఘాతుకమే అయ్యుంటుందని భావిస్తున్నారు.
Disha
Telangana
Police

More Telugu News