అన్నం తినేవాళ్లు ఎవరూ వైసీపీలోకి వెళ్లరని వ్యాఖ్యానించింది ఎవరు... వంశీ కాదా?: వర్ల రామయ్య
- ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ
- తాజాగా అధినాయకత్వంపై వ్యాఖ్యలు
- పార్టీ నుంచి బహిష్కరించిన టీడీపీ
'గతంలో జగన్ వార్డు మెంబరుగా కూడా పనికిరాడని వ్యాఖ్యలు చేసింది ఎవరు? అన్నం తినేవాళ్లు ఎవరూ వైసీపీలోకి వెళ్లరని అన్నది ఎవరు? సాక్షి దొంగ చానల్ అని చెప్పింది ఎవరు?... వంశీ కాదా? అంటూ ప్రశ్నించారు. వంశీ గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదా?' అంటూ మండిపడ్డారు.