శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ పురస్కారాలను ప్రకటించిన నాగార్జున!
- ఈ నెల 17న ఏఎన్నార్ అవార్డుల ప్రదానం
- 2018. 2019 సంవత్సరాలకు అవార్డులు
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న చిరంజీవి
ఇక 2018వ సంవత్సరానికిగాను దివంగత శ్రీదేవికి, 2019 ఏడాదికిగాను సీనియర్ నటి రేఖకు అవార్డులను అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈనెల 17న నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మరోవైపు అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో 'అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా' మూడవ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేఖ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు.