అలా నా సినిమా ప్రయాణం మొదలైంది: సీనియర్ హీరోయిన్ రాశి
- బాలనటిగా తొలి సినిమా'గిరఫ్తార్'
- 14 ఏళ్లకే హీరోయిన్ ను అయ్యాను
- నాకు ఎంత క్రేజ్ ఉందనేది కూడా తెలిసేది కాదన్న రాశి
తెలుగులో బాలనటిగా చేసిన 'రావుగారిల్లు'మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత హీరోయిన్ గా 'శుభాకాంక్షలు' చేశాను. ఈ సినిమా సమయంలోనే నా పేరును విజయలక్ష్మీ నుంచి 'రాశి'గా మార్చారు. అలా 14 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. ఎంత పారితోషికం ఇస్తున్నారు? ఎంత క్రేజ్ వుంది? అనే విషయం కూడా అప్పుడు నాకు తెలిసేది కాదు. సినిమాలు చూసుకునేందుకు థియేటర్స్ కి వెళ్లినప్పుడు అభిమానులు పూలు చల్లుతుంటే మాత్రం ఆనందం కలిగేది" అని చెప్పుకొచ్చారు.