బీజేపీలోకి రావాలంటూ కిషన్రెడ్డి ఆహ్వానం.. సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి?
- కిషన్రెడ్డితో రెండు గంటలపాటు చర్చలు
- వారి ఆహ్వానాన్ని మన్నించిన మోత్కుపల్లి
- మోత్కుపల్లి చేరికతో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశ
టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని అసంతృప్త కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించింది. ఆయనను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. దీంతో ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించింది. ఓ ప్లాట్ఫాం కోసం ఎదురుచూస్తున్న మోత్కుపల్లి కూడా కిషన్రెడ్డి, లక్ష్మణ్ల ఆహ్వానాన్ని మన్నించినట్టు సమాచారం.