మరో రెండు గంటల్లో ప్రారంభం కానున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక లెక్కింపు
- 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
- మొత్తం 22 రౌండ్లు, 14 టేబుళ్ల ఏర్పాటు
- మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం
ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా, హుజూర్‌నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి నుంచి వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉండడంతో, ఆయన భార్య పద్మావతి ఇక్కడ బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ విజయం పట్ల ధీమాగా వుంది. అయితే, ఇక్కడ తమదే గెలుపని టీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు టీడీపీ, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.