అవుటైన కోపంలో గోడను కొట్టి గాయపడిన సఫారీ ఓపెనర్... మూడో టెస్టుకు దూరం
- రెండో టెస్టులో మార్ క్రమ్ పేలవ ఆటతీరు
- రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ బంతికి అవుట్
- టీవీ రీప్లేలో నాటౌట్ గా తేలిన వైనం
- కోపం భరించలేకపోయిన మార్ క్రమ్
దాంతో మార్ క్రమ్ చేతికి బలమైన గాయం అయింది. మణికట్టులో పగులు రావడమే కాదు, కొన్ని చేతివేళ్ల ఎముకలు చిట్లినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దాంతో శనివారం ప్రారంభమయ్యే మూడో టెస్టులో మార్ క్రమ్ ఆడబోవట్లేదని దక్షిణాఫ్రికా వర్గాలంటున్నాయి. మార్ క్రమ్ చికిత్స కోసం స్వదేశానికి పయనం కానున్నట్టు సమాచారం.