రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట

  • కన్నడలో హిట్ కొట్టిన 'కవుల్దారి'
  • తెలుగు రీమేక్ లో సుమంత్
  • వీరభద్రమ్ చౌదరితో రాజశేఖర్ చర్చలు
రాజశేఖర్ 'గరుడవేగ' సినిమా నుంచి తన జోరు పెంచాలనే భావించారు. అయితే ఒక పట్టాన ప్రాజెక్టులు సెట్ కావడం లేదు. అలాగే 'కల్కి' సినిమా విషయంలోను కొంత ఆలస్యం జరిగింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.

కన్నడలో సూపర్ హిట్ కొట్టిన 'కవుల్దారి' సినిమాకి ఇది రీమేక్. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సాగించే ఇన్వెస్టిగేషన్ స్టోరీ. అందుకే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఏమైందో తెలియదుగానీ, రాజశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. దాంతో ఈ సినిమాను సుమంత్ తో చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక వీరభద్రమ్ చౌదరితో రాజశేఖర్ కథా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అవుతుందేమో చూడాలి మరి.
Rajasekhar

More Telugu News