'యాక్షన్'తో వచ్చేస్తోన్న విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'యాక్షన్'తో వచ్చేస్తోన్న విశాల్

  • విశాల్ హీరోగా రూపొందిన 'యాక్షన్'
  • అండర్ కవర్ కాప్ పాత్రలో తమన్నా
  • ముఖ్యమైన పాత్రలో యోగిబాబు
తెలుగు .. తమిళ భాషల్లో మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు విశాల్ సినిమాలను వీలైనన్ని ఎక్కువమార్లు చూస్తుంటారు. తమిళంతో పాటు తెలుగులోనూ విశాల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలా నవంబర్ లో 'యాక్షన్' సినిమా విడుదలకి సిద్ధమవుతోంది.

దర్శకుడు సుందర్ సి. .. విశాల్ హీరోగా ఒక మాస్ యాక్షన్ మూవీని రూపొందించాడు. విశాల్ తో పాటు ఆయన జోడీకట్టిన తమన్నా కూడా ఈ సినిమాలో అండర్ కవర్ కాప్ గా కనిపించనుంది. ఇక కమెడియన్ యోగిబాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇటీవల వదిలిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో విశాల్ కి మరో హిట్ దొరుకుతుందేమో చూడాలి.
Vishal
Thamanna

More Telugu News