సూసైడ్ నోట్ ఉందేమో, అందులో తన పేరు ఉందేమోనని చంద్రబాబు కంగారుపడ్డాడు: కొడాలి నాని
- కోడెలను బతికి ఉండగా పట్టించుకోలేదు
- ఆయన మృతి చెందగానే బాబు కంగారుపడుతున్నాడు
- సూసైడ్ నోట్ లేదని తెలియగానే శవరాజకీయాలకు సిద్ధపడ్డారు
‘కోడెల శివప్రసాద్ ను వైసీపీ చంపేసింది, జగన్మోహన్ రెడ్డి చంపేశాడు’ అంటూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై 12 కేసులు ఉన్నాయంటున్న చంద్రబాబు, ఎన్ని కేసుల్లో ఆయన స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.