'వి' సినిమా కోసం థాయ్ లాండ్ వెళ్లనున్న నాని
- ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి క్రైమ్ థ్రిల్లర్
- థాయ్ లాండ్ లో జరుగుతోన్న షూటింగ్
- నాయికలుగా నివేదా థామస్ - అదితీరావు
ఈ సినిమాలో సుధీర్ బాబు - నాని ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు థాయ్ లాండ్ లో జరుగుతోంది. సుధీర్ బాబు కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే నాని అక్కడ జరుగుతోన్న షూటింగులో జాయిన్ కానున్నాడు. నాని - సుధీర్ బాబు కాంబినేషన్లో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. నాని పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. అదితీరావు హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు.