ఓ నిర్మాత బిల్ కట్టలేదు .. నన్ను హోటల్ వాళ్లు కదలనీయలేదు: సినీ గేయరచయిత అనంత శ్రీరామ్
Add ap7am to your home Screen

ఓ నిర్మాత బిల్ కట్టలేదు .. నన్ను హోటల్ వాళ్లు కదలనీయలేదు: సినీ గేయరచయిత అనంత శ్రీరామ్

  • పాటల పనిలో చెన్నైలోని ఒక హోటల్లో వున్నాను 
  • బిల్ కోసం కాల్ చేస్తే నిర్మాత లిఫ్ట్ చేయడు 
  • తెలివిగా అక్కడి నుంచి బయటపడ్డానన్న అనంత శ్రీరామ్
పాటల రచయితగా పాప్యులర్ అయిన అనంత శ్రీరామ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్లో తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు. "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ చిన్న సినిమా నిర్మాత, తన సినిమాకి పాటలు రాయమని చెప్పి చెన్నై హోటల్లో నా కోసం ఒక రూమ్ తీశాడు.

ఆయన పని పూర్తి కావొస్తుండగా, మరో పెద్ద నిర్మాత తన సినిమాకి కూడా పాటలు రాయాలనీ, అదే రూములో కంటిన్యూ అవ్వమని అన్నాడు. దాంతో నేను ఆ రూములోనే ఉండిపోయాను. రూము తీసిన చిన్న నిర్మాత వెళ్లిపోయాడు. పెద్ద నిర్మాత మరో రచయితతో పాట రాయించుకుని నన్ను పట్టించుకోలేదు. హోటల్ వాళ్లేమో 'బిల్ కట్టిన తరువాతే కదిలేది' అంటూ అక్కడే ఉంచేశారు. ఆ పెద్ద నిర్మాతకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. చివరికి చిన్న నిర్మాత మేనేజర్ కి కాల్ చేసి, తెలివిగా అక్కడి నుంచి బయటపడ్డాను" అని చెప్పుకొచ్చాడు.
Anantha Sriram
Ali

More Telugu News