తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ... నేడు బీజేపీలోకి సామ రంగారెడ్డి, మువ్వా సత్యనారాయణ, నందీశ్వర్ గౌడ్, శోభారాణి... మరెంతో మంది!
- నేడు ఏపీలో పర్యటించనున్న జేపీ నడ్డా
- బీజేపీలో చేరనున్న పలువురు నేతలు
- నాంపల్లి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ
జేపీ నడ్డా సమక్షంలో మాజీ మంత్రి జగన్ నాయక్, కోనేరు సత్యనారాయణ (కొత్తగూడెం), బొట్ల శ్రీనివాస్ (జనగామ), మువ్వా సత్యనారాయణ (శేరిలింగంపల్లి), నందీశ్వర్ గౌడ్ (పటాన్ చెరువు), సామ రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), శ్రీనివాస్ గౌడ్ (నల్గొండ), శోభారాణి (భువనగిరి), పాల్వాయి రజనీ కుమారి (నకిరేకల్), జయశ్రీ (మహబూబ్ నగర్), శ్రీలతా రెడ్డి (కోదాడ), బేగ్ (ఖమ్మం) లు బీజేపీలో చేరనున్నారు. వీరితో పాటు సాదినేని శ్రీనివాసరావు, శ్రీకాంత్ గౌడ్, ఎంఎన్ శ్రీనివాసరావు, గరికపాటి రామ్మోహన్ రావు, లంకల దీపక్ రెడ్డి వంటి పేరున్న నేతలు బీజేపీలో చేరనున్నారు.