తిరుమలలో భక్తజన సంద్రం.. సర్వదర్శనానికి 24 గంటలు!

Tirumala packed with devotees as Sarvadarshanam takes 24 hours
  • వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు
  • శనివారం ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న 84 వేల మంది భక్తులు
  • నిన్న రూ.4.08 కోట్లుగా నమోదైన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలికి విస్తరించి బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.

ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం లభించేందుకు సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 నుంచి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతుందని వివరించారు.

తిరుమలలో నెలకొన్న రద్దీ తీవ్రతను శనివారం నాటి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే మొత్తం 84,166 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 36,673 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీకి రూ.4.08 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి అధికారులు 4.74 లక్షల లడ్డూలను విక్రయించారు.
Advertisement
Tirumala
TTD
Sarvadarshanam waiting time
Tirumala devotee rush
Lord Venkateswara temple
Srivari Darshan update

More Telugu News