మా గుర్రానికి ఓ పిల్ల పుట్టింది... ఏ పేరు పెట్టాలో చెప్పరూ..: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా గుర్రానికి ఓ పిల్ల పుట్టింది... ఏ పేరు పెట్టాలో చెప్పరూ..: ఉపాసన

  • ఫిల్లీ అనే గుర్రాన్ని పెంచుకుంటున్న రామ్, ఉప్పీ
  • ఇటీవల ఆడ గుర్రాన్ని కన్న ఫిల్లీ
  • సోషల్ మీడియాలో పంచుకున్న ఉపాసన
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రామ్ చరణ్ భార్య ఉపాసన, ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారిని సలహా అడిగింది. తాము పెంచుకుంటున్న గుర్రం 'ఫిల్లీ'కి ఆడ పిల్ల పుట్టింద‌ని, అది చాలా అందంగా ఉంద‌ని చెబుతూ తల్లీబిడ్డల ఫోటోను షేర్ చేసింది. పుట్టిన గుర్రానికి మంచి పేరు సూచించాలని కోరింది.

రామ్ కు, ఉప్పీకి జంతువులంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ గుర్రాన్ని రామ్ చిన్నప్పటి నుంచి పెంచుతున్నాడు. ఇక నెటిజన్లు దీనికి చాలా రకాల పేర్లను సూచించారు. కరుణ్, గ్రేసీ, రీనా, సనా, మిస్సీ, ఉడాన్, చెర్రీ, చిట్టి, ధ్రువ, మస్తంగ్... ఇలా ఎన్నో పేర్లు బయటకు వస్తున్నాయి.
Ramcharan
Upasana
Filly

More Telugu News