టీడీపీ కార్యకర్తలను, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా: సోము వీర్రాజు

  • కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ
  • ఆ పార్టీతోనే చంద్రబాబు కలిశారు
  • చంద్రబాబు తన హయాంలో అడ్డగోలు అవినీతి చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఇప్పుడు ఆ పార్టీతోనే చంద్రబాబు కలిశారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశం గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. 2019లో అధికారంలోకి వస్తాననే భ్రమతో అడ్డగోలుగా అవినీతి చేశారని, పోలవరం అథారిటీని కూడా పని చేయనివ్వలేదని ఆరోపించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
bjp
somu

More Telugu News