మనం మరో సర్జికల్ స్ట్రయిక్ చేశాం: భారత్ విజయంపై అమిత్ షా
- పాక్ పై భారత్ ఘన విజయం
- క్రీడాభిమానుల సంబరాలు
- అభినందనలు తెలుపుతున్న ప్రముఖులు
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, "పాకిస్థాన్ పై టీమ్ ఇండియా మరో సర్జికల్ స్ట్రయిక్ చేసింది. భారత టీమ్ మొత్తానికీ అభినందనలు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణం" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇదే సమయంలో కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజిజు "హిందుస్థాన్ గెలుస్తుందని, పాకిస్తాన్ ఓడిపోతుందని ముందే చెప్పాం. ఇండియన్ టీమ్ కు అభినందనలు" అని అన్నారు.