వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్
- టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
- మ్యాచ్ కు పొంచివున్న వానగండం
- అభిమానుల్లో తారాస్థాయికి చేరిన ఉత్కంఠ
అయితే, మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్ లో ఉదయం నుంచి వర్షం అడపాదడపా కురుస్తుండడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు స్థానం కల్పించారు. ఇప్పటివరకు పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని విజయ్ శంకర్ ఏకంగా పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ అరంగేట్రం చేయనుండడం విశేషం అని చెప్పాలి. ఇక పాక్ టీమ్ లో షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసింలకు చోటిచ్చారు.