చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ ను కట్టడి చేసిన సఫారీ బౌలర్లు

  • ఇంగ్లాండ్ 311/8
  • ఎంగిడికి మూడు వికెట్లు
  • ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్
ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగిందంటే 350 పైచిలుకు స్కోర్లు నమోదయ్యేవి. తాజాగా ఓవల్ లో దక్షిణాఫ్రికాపై బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ మిడిల్ ఓవర్ల వరకు తన పాత జోరు ప్రదర్శించినా, చివరి ఓవర్లలో సఫారీ బౌలర్లు పుంజుకోవడంతో ఆశించిన స్కోరు దక్కలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ అత్యధికంగా 89 పరుగులు చేశాడు. ఓ దశలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఆడుతున్న తీరు చూస్తే 400 స్కోరు సాధ్యమే అనిపించింది. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. ఎంగిడి 3 వికెట్లు, తాహిర్, రబాడా చెరో రెండు వికెట్లు తీశారు.
Go Back to Shorts
Cricket

More Telugu News