అందుకే నేను పెళ్లిచేసుకోలేదు: నటి పాకీజా
Add ap7am to your home Screen

అందుకే నేను పెళ్లిచేసుకోలేదు: నటి పాకీజా

  • ఒక వైపున అమ్మకి వైద్యం చేయించాలి 
  • మరో వైపున చెల్లి పెళ్లి చేయాలి
  •  అన్నిటికీ ఆ దేవుడే వున్నాడు    
తెలుగు .. తమిళ భాషల్లో హాస్యనటిగా పాకీజా (వాసుకి) ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ రెండు భాషల్లోను కలిపి ఆమె 150 సినిమాల వరకూ చేశారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ "నేను పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో అమ్మ కేన్సర్ తో బాధపడుతూ ఉండేది. చెల్లెలేమో పెళ్లికి వుంది. అమ్మకి వైద్యం చేయించాలి .. చెల్లెలికి పెళ్లి చేయాలి.

ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుంటే, వచ్చేవాడు నా బాధ్యతలకు అడ్డు తగలొచ్చు. లేదంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఉడాయించవచ్చు. మా బంధువుల్లో ఒకరికి ఇలాగే జరిగింది. ఆ భయంతోనే నేను పెళ్లి చేసుకోలేదు. నా వృద్ధాప్యంలో చెల్లెలి పిల్లలు చూస్తారనే ఆశ వుంది. వాళ్లు చూడకపోతే ఆ దేవుడే చూసుకుంటాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు. 
vasuki
ali

More Telugu News