ఎగ్జిట్ పోల్స్ పై తొలిసారిగా స్పందించిన వీవీ లక్ష్మీనారాయణ!
- ఈ ఎగ్జిట్ పోల్స్ ను మేం పట్టించుకోవడం లేదు
- గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటాం
- విశాఖలో మీడియాతో జనసేన నేత
విశాఖపట్నంలో ఈరోజు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అనవసరంగా ఉత్కంఠను కలిగిస్తున్నారని విమర్శించారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు.