పిల్లలకు అనుక్షణం అండగా నిలిచిన టీచర్లు, తల్లిదండ్రులకు నా అభినందనలు!: నారా లోకేశ్
- ఏపీలో పదో తరగతి ఫలితాల ప్రకటన
- విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మంత్రి
- మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈరోజు విడుదలైన ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 94.88% ఉత్తీర్ణత సాధించిన క్రమంలో, విద్యార్థులకు అనుక్షణం అండగా నిలిచి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.