2015లో కల్పన, నెలన్నర క్రితం మనీషా, ఈ నెల 25న శ్రావణిలపై అత్యాచారం, హత్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2015లో కల్పన, నెలన్నర క్రితం మనీషా, ఈ నెల 25న శ్రావణిలపై అత్యాచారం, హత్య!

  • ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న శ్రీనివాసరెడ్డి దారుణాలు
  • కర్నూలులో ఒక మహిళను రేప్ చేసి హత్య
  • వరంగంలో ఓ మహిళపై అత్యాచార యత్నం
యాదాద్రి జిల్లా హాజీపూర్ లో మానవమృగం శ్రీనివాసరెడ్డి చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అన్ని విషయాలను వెల్లడించాడు. కల్పన, మనీషా, శ్రావణిలను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

2015లో 15 ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేశానని శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపాడు. నెలన్నర క్రితం డిగ్రీ చదువుతున్న మనీషాను రేప్ చేసి చంపేశానని చెప్పాడు. ఈ నెల 25వ తేదీన స్కూల్ నుంచి వస్తున్న శ్రావణిపై అత్యాచారం చేశానని, ఆ తర్వాత హత్య చేశానని తెలిపాడు. ముగ్గుర్నీ పాడుపడిన బావిలో పాతిపెట్టానని చెప్పారు. కర్నూలులో కూడా ఒ మహిళపై హత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్ లో మరో మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
sravani
mahisha
kalpana
murder
hazipur
srinivasa reddy

More Telugu News