కమనీయంగా రామోజీరావు మనవరాలు కీర్తి సోహాన వివాహం... తరలివచ్చిన ప్రముఖులు, సందడి చేసిన తారాలోకం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమనీయంగా రామోజీరావు మనవరాలు కీర్తి సోహాన వివాహం... తరలివచ్చిన ప్రముఖులు, సందడి చేసిన తారాలోకం!

  • వినయ్ తో అత్యంత వైభవంగా వివాహం
  • అద్భుత రీతిలో కల్యాణం మండపం
  • పలువురు ప్రముఖుల హాజరు
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహాన వివాహం వినయ్‌ తో అత్యంత వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అని చెప్పుకునేలా అద్భుత రీతిలో తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో వీరి వివాహం జరుగగా, ఎందరో ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు దంపతులను ఆశీర్వదించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వీరిని ఆశీర్వదించేందుకు మరికొద్ది సేపట్లో వివాహ వేదిక వద్దకు రానున్నారు.

ఈ వేడుకకు రాజకీయ నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, కోడెల శివప్రసాదరావులతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు. టీ సుబ్బరామిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధ ప్రసాద్‌, జయప్రకాశ్‌ నారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌ తదితరులు కూడా హాజరయ్యారు.

ఇక వివాహానికి హాజరైన సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ దంపతులు, కృష్ణ, విజయనిర్మల దంపతులు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కృష్ణంరాజు దంపతులు, అల్లు అరవింద్‌, శ్యామ్ ప్రసాద్‌ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, బోయపాటి శ్రీనివాస్‌, కీరవాణి, అచ్చిరెడ్డి, తదితరులు ఉన్నారు. వీరందరినీ రామోజీరావు సాదరంగా ఆహ్వానించారు. 
Ramoji Rao
Keerthy Sohana
Vinay
Marriage

More Telugu News