అలీ ఎన్ని కష్టాలుపడి పైకొచ్చాడనే విషయం పవన్ కల్యాణ్ కి తెలియదు: కమెడియన్ పృథ్వీ
Add ap7am to your home Screen

అలీ ఎన్ని కష్టాలుపడి పైకొచ్చాడనే విషయం పవన్ కల్యాణ్ కి తెలియదు: కమెడియన్ పృథ్వీ

  • చెన్నైలో అలీ .. నేను కలిసి తిరిగాము
  • నాకు ఫోన్ చేసి అలీ చాలా బాధపడ్డాడు
  • అలీకి సాయం చేయడం మాత్రమే తెలుసు
పవన్ కల్యాణ్ .. అలీ ఎంతో మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అలీ వైసీపీలో చేరడం, ఆ విషయాన్ని అలీ స్వస్థలమైన రాజమండ్రి సభలో పవన్ ప్రస్తావిస్తూ అతనిపై కొన్ని ఆరోపణలు చేయడం తెలిసిందే. తాను చేసిన సాయాన్ని అలీ మరిచిపోయాడన్నట్టుగా పవన్ మాట్లాడటం .. దానికి కౌంటర్ గా అలీ ఒక వీడియో వదిలిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని గురించి కమెడియన్ పృథ్వీ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు.

"పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు అలీకి చాలా బాధను కలిగించాయి. తన సన్నిహితులందరితో పాటు నాకు కూడా ఫోన్ చేసి .. 'పవన్ కల్యాణ్ గారు ఇలా అన్నారేంటి?' అంటూ బాధ పడ్డాడు. అలీని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును .. చెన్నైలో మేమంతా కలిసి తిరిగిన వాళ్లం. దూరం నుంచి చిరంజీవిని .. మోహన్ బాబును చూసి సంతోషపడిన వాళ్లం. అలీ ఎన్ని కష్టాలు పడ్డాడో .. ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయాలు చేశాడో నాకు తెలుసు .. పవన్ కల్యాణ్ కి తెలియదు. చేసిన మంచిని ఎవరికీ చెప్పుకోని గొప్ప వ్యక్తిత్వం అలీ సొంతం. ఆయనకి మంచి చేయడమేగానీ .. మోసం చేయడం తెలియదు" అని చెప్పుకొచ్చాడు. 
ali
pruthvi

More Telugu News