త్రివిక్రమ్ దర్శకుడిగా అల్లు అర్జున్ సినిమా లాంచ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ దర్శకుడిగా అల్లు అర్జున్ సినిమా లాంచ్

  • సెట్స్ పైకి అల్లు అర్జున్ 19వ సినిమా
  •  త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా
  •  కథానాయికగా పూజా హెగ్డేకి మరో ఛాన్స్  
తెలుగు తెరపై తమ జోరును కొనసాగిస్తోన్న స్టార్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తన 19వ సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ .. దర్శకనిర్మాతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. గతంలో అల్లు అర్జున్ సరసన ఆమె 'దువ్వాడ జగన్నాథం'లో మెప్పించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో ఈ ఇద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరుతుందేమో చూడాలి. 
allu arjun
pooja hegde

More Telugu News