భారీగా పారితోషికం పెంచేసిన అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీగా పారితోషికం పెంచేసిన అనిల్ రావిపూడి

  • అగ్రదర్శకుడిని చేసిన వరుస విజయాలు
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  •  త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల తరువాత స్థానంలో ఇప్పుడు అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. ఒక సినిమాకి మించి మరో సినిమాను విజయాలవైపు పరుగులు తీయిస్తూ, చాలా తక్కువ కాలంలో అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయాడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' .. 'ఎఫ్ 2' చిత్రాలు భారీ వసూళ్లను సాధించి, దర్శకుడిగా ఆయన సత్తాను చాటి చెప్పాయి. మహేశ్ బాబుతో తదుపరి సినిమా చేసేంత అవకాశాన్ని అందించాయి.

అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలంతా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దిల్ రాజు - అనిల్ సుంకర నిర్మాతలుగా మహేశ్ బాబుతో చేయనున్న సినిమాకిగాను ఆయన 12 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. 
anil ravipudi

More Telugu News