నేను ప్యాకేజీ తీసుకోవడం మీరు చూశారా? లేక సెల్ఫీ తీశారా?: దివ్యవాణిపై మండిపడ్డ అలీ
Add ap7am to your home Screen

నేను ప్యాకేజీ తీసుకోవడం మీరు చూశారా? లేక సెల్ఫీ తీశారా?: దివ్యవాణిపై మండిపడ్డ అలీ

  • వైసీపీలో చేరేందుకు అలీ ప్యాకేజీ తీసుకున్నారన్న దివ్యవాణి
  • టీడీపీలో చేరేందుకు మీరెంత తీసుకున్నారన్న అలీ
  • సినీ నటుల మధ్య పేలుతున్న మాటల తూటాలు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. రాజకీయవేత్తలకు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఏపీలో పలు పార్టీలకు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో టీడీపీ తరపున దివ్యవాణి, వైసీపీ తరపున అలీ కూడా ఉన్నారు.

తాజాగా దివ్యవాణి మాట్లాడుతూ, ప్యాకేజీ తీసుకుని వైసీపీలో అలీ చేరారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అలీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ప్యాకేజీ తీసుకున్నట్టు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీలో చేరేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ali
ysrcp
divya vani
Telugudesam

More Telugu News