అందుకే, చంద్రబాబు తన రెండేళ్లు చూపిస్తుంటారు: వైఎస్ షర్మిళ సెటైర్లు
- బాబు తన రెండు వేళ్లు చూపిస్తుంటే ఏదో అనుకున్నాం
- రెండు నాల్కల ధోరణి అని ఇప్పుడు అర్థమైంది
- ఏపీకి ‘ప్రత్యేకహోదా’ను నీరు గార్చింది చంద్రబాబే
ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ను నీరు గార్చింది చంద్రబాబే అని, ఆ ‘హోదా’ సాధన కోసం నిరంతరం పోరాడుతోందని జగన్ అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలన్న చంద్రబాబు, మళ్లీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగడానికి కారణం జగనే అని, ‘దమ్ముంటే, చంద్రబాబు నిజం చెప్పాలని, కానీ, ఆయనకు దమ్ము లేదు’ అని అన్నారు.