'బ్రోచేవారెవరురా' నుంచి నివేదా థామస్ పోస్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బ్రోచేవారెవరురా' నుంచి నివేదా థామస్ పోస్టర్

  • కథానాయకుడిగా శ్రీవిష్ణు 
  • సినిమా నేపథ్యంలో సాగే కథ 
  • 'మిత్ర' పాత్రలో నివేదా థామస్
చదువు కారణంగా మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న నివేదా థామస్, మళ్లీ తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టింది. పాత్ర నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతోంది. అలా తాజాగా ఆమె 'బ్రోచేవారెవరురా' సినిమాలో చేస్తోంది. 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

శ్రీవిష్ణు .. నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నివేద థామస్ పోస్టర్ ను వదిలారు .. 'మిత్ర' అనే పాత్రలో ఆమె కనిపించనుందంటూ పరిచయం చేశారు. సినిమా నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందనీ .. ఒక ఆర్టిస్ట్ గానే అందులో నివేద కనిపించనుందని ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ  సినిమాలో, ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
srivishnu
niveda thomas
niveda peturaj

More Telugu News