విశాల్ కి ఏమీ తెలియదు .. అయినా అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు: రాధారవి విమర్శ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాల్ కి ఏమీ తెలియదు .. అయినా అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు: రాధారవి విమర్శ

  • 'రాధారవి' తీరుపై విశాల్ ఆగ్రహం 
  •  రాధారవి నుంచి 'రాధ'ను తొలగించండన్న విశాల్  
  • అది మా నాన్నగారి పేరన్న రాధారవి
తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల ఒక వేదికపై .. నయనతారను కించపరుస్తూ మాట్లాడారు. ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా ఆయన అలా అవమానకరంగా మాట్లాడటం పట్ల, స్టార్ హీరో విశాల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "రాధారవి గారూ .. మహిళల గురించి .. ముఖ్యంగా ఒక నటిని గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు .. మీ పేరులోని 'రాధ'ను తొలగించి .. 'రవి' అని మాత్రమే పిలుపించుకోండి" అంటూ ట్వీట్ చేశారు.

అందుకు రాధారవి తనదైన శైలిలో స్పందిస్తూ .. "విశాల్ కి ఏమీ తెలియదు .. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. 'రాధ' అనేది మా తండ్రిగారి పేరు .. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది" అన్నారు. అంతేకాదు .. గతంలో ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ నామినేషన్ తిరస్కరింపబడటాన్ని గుర్తుచేస్తూ రాధారవి వ్యంగంగా మాట్లాడారు.
vishal
radharavi

More Telugu News