క్రేజ్ వచ్చింది .. కానీ కారు కూడా లేక బస్సులో తిరగవలసి వచ్చింది: సీనియర్ నటుడు ప్రదీప్
Add ap7am to your home Screen

క్రేజ్ వచ్చింది .. కానీ కారు కూడా లేక బస్సులో తిరగవలసి వచ్చింది: సీనియర్ నటుడు ప్రదీప్

  • ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది 
  • ఆర్ధికంగా నా పరిస్థితి మారలేదు
  •  కారులేక బస్సుల్లోనే తిరిగాను
ప్రదీప్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'ముద్దమందారం' నిలిచింది. అప్పట్లో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమా ముందు వరుసలో నిలిచింది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రదీప్ ప్రస్తావించారు. 'ముద్ద మందారం' సినిమా సూపర్ హిట్ అయినా, ఆ సినిమా వలన నాకు పెద్దగా డబ్బులేం రాలేదు. నేనేమో దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.

ఒక్కసారిగా హీరోనైపోయి హిట్ కొట్టినా నా జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడు నాకు బైక్ గానీ .. కారు గాని కొనుక్కునే స్థోమత లేదు .. బస్సులోనే తిరిగేవాడిని. దాంతో నన్ను చూడటానికి జనం ఎగబడేవారు. ఒకసారి అలా ఎగబడటం వలన ఆ బస్సు అద్దం పగిలిపోయింది. దాంతో 'సినిమావాడివంటున్నారు .. కార్లో తిరగొచ్చుగా .. నా బస్సే దొరికిందా నీకు' అంటూ ఆ బస్సు డ్రైవర్ నాపై కోప్పడ్డాడు. అంతేకాదు ఆ అద్దం పగలడానికి నేనే కారణమని కాయితం కూడా రాయించాడు" అంటూ చెప్పుకొచ్చారు.
pradeep
ali

More Telugu News