విశ్వనాథ్ గారి సినిమాలో అవకాశమంటే మాటలా?: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్
- బాలుగారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది
- గొప్ప కథానాయికలు చేశారు
- కమల్ హీరో అనడంతో కథ వినలేదు
"జయప్రద .. సుహాసిని .. రాధిక .. విజయశాంతి వంటి గొప్ప కథానాయికలు విశ్వనాథ్ గారి సినిమాల్లో చేశారు. విశ్వనాథ్ గారి కథానాయికగా ఆ జాబితాలో నా పేరు కూడా చేరడం నేను చేసుకున్న అదృష్టం. ఆ సినిమాకి ఎస్పీ బాలు గారు నిర్మాత .. ఆయన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్లి కలవగానే కమల్ ఆ సినిమాలో హీరో అని చెప్పారు .. అంతే ఇక కథ చెప్పవలసిన అవసరం లేదని అన్నాను. ఎందుకంటే కమల్ సరసన ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునేదాన్ని. అలా ఆ సినిమా నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.