ఇలాంటి అదృష్టం ఇంకెవరికీ దక్కలేదేమో: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్
Add ap7am to your home Screen

ఇలాంటి అదృష్టం ఇంకెవరికీ దక్కలేదేమో: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్

  • తమిళంలో ఫస్టు సినిమా 'వల్లీ'
  • తెలుగులో 'మా వూరి మారాజు'
  • అప్పటికి తెలుగు అసలు రాదు
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా ప్రియా రామన్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి చెప్పుకొచ్చారు. "తమిళంలో నా మొదటి సినిమా 'వల్లీ'. రజనీకాంత్ సొంత బ్యానర్లో .. ఆయన కథానాయకుడిగా చేసిన సినిమా అది.

తొలి సినిమానే ఆయన నిర్మాతగా .. ఆయన కాంబినేషన్లో చేయవలసి రావడం .. అదీ టైటిల్ రోల్ చేయడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నాకు తెలిసి ఇలాంటి అదృష్టం వేరెవరికీ దక్కలేదేమో. ఆ సినిమాయే తెలుగులో 'విజయ' పేరుతో విడుదలైంది. ఆ తరువాత తెలుగులో 'మా ఊరి మారాజు' సినిమా చేశాను. అప్పటికి నాకు తెలుగు ఒక్క ముక్క రాదు .. అయినా అందరి సహాయ సహకారాలతో ఆ సినిమా చేశాను .. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని అన్నారు. 
priya raman
ali

More Telugu News