హమ్మయ్య.. ఎట్టకేలకు నేడు వేతనాలు అందుకోనున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు
- వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
- నేడు విడుదల చేస్తామన్న బీఎస్ఎన్ఎల్ ఎండీ
- హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
కాగా, మార్చి నెలలో రూ.2,700 కోట్ల వరకు వసూళ్లు రానున్నాయని, అందులో రూ.850 కోట్లను వేతనాల కోసం ఉపయోగించనున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. కాగా, వేతనాలు ఆగిపోవడంతో తన పిల్లలకు ఆహారాన్ని కూడా సరిగా అందించలేకపోతున్నానంటూ ఓ ఉద్యోగి చేసిన వ్యాఖ్యల వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో వేతనాల విడుదల గొప్ప ఊరటేనని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.