జగన్ మాట ఇస్తే తప్పడు.. ఆయన్ను గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకుందాం!: సినీ నటుడు అలీ
- పార్టీలకు అతీతంగా పేదలను వైఎస్సార్ ఆదుకున్నారు
- అందుకే వైఎస్సార్ అంటే నాకు చాలా ఇష్టం
- త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి జగన్ అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను గెలిపించి ముఖ్యమంత్రిగా చేద్దామని పిలుపునిచ్చారు. త్వరలోనే ఏపీలో రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ఇటీవల జగన్ సమక్షంలో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.