మహేశ్ మూవీ కోసం విజయశాంతితో అనిల్ రావిపూడి సంప్రదింపులు?
- మహేశ్ బాబు 26వ సినిమాకి సన్నాహాలు
- సున్నితంగా తిరస్కరించిన ఉపేంద్ర
- రాజకీయాల్లో బిజీగా విజయశాంతి
అయితే డేట్స్ లేని కారణంగా తాను ఈ సినిమాను చేయలేనని అన్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర స్వయంగా చెప్పాడు. ఇక మరో కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితే బాగుంటుందని భావించిన అనిల్ రావిపూడి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. తన సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన వున్నట్టుగా చెబుతున్నారు. అయితే విజయశాంతి ఏమన్నారనే విషయం ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.