పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు తీసేసే యత్నం!
- వైసీపీ ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు
- వైసీపీ కార్యకర్త పేరిట దరఖాస్తు
- విచారిస్తున్న పోలీసులు
పూతలపట్టు నియోజక వర్గంలోని ఐరాల మండల పరిధిలోని పైపల్లె గ్రామంలో తన ఓటు ఉందని, ఫారమ్–7 దరఖాస్తును ఆన్ లైన్ లో పెట్టి, తన ఓటు తొలగించాలని దరఖాస్తు వచ్చిందని చెప్పారు. అధికారులు దీన్ని పరిశీలించి ఇది వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ పెట్టినట్టు తేల్చగా, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను దరఖాస్తు చేయలేదని చెప్పడం గమనార్హం. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.