భర్త అనుమానం... తప్పు చేయలేదంటూ యువతి ఆత్మహత్య!
- ఆత్కూరు మండలం తేలప్రోలులో కలకలం
- సేల్స్ ఉద్యోగినిగా పనిచేస్తున్న లక్ష్మీ భవాని
- విధుల్లో భాగంగా పలువురితో మాట్లాడే భవానీ
- భర్త అనుమానించడంతో ఆత్మహత్య
ఇద్దరి మధ్యా వాగ్వాదాలు పెరుగగా, అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతురు ప్రవర్తన బాగోలేదని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీభవానీ, నిన్న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణం దక్కలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించి, అనిల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తమ అల్లుడు అనిల్, కుమార్తెను హింసించాడని, తన వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నాడన్న లక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.