'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ అరెస్టు
- నీట్ అవకతవకల నిరసనలకు మద్దతు తెలిపిన నటి ఆయేషా ఖాన్
- ముంబైలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న నటి
'ధురంధర్' చిత్రంతో గుర్తింపు పొందిన నటి ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలకు ఆమె మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష వివాదంపై సీజేపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలకు సంఘీభావం తెలిపే కార్యక్రమాల్లో ఆయేషా ఖాన్ పాల్గొంటుండంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
నీట్ విద్యార్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నందుకు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆమె తన సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తొలుత పోలీస్ వ్యాన్‌లో, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో తీసిన వీడియోలను ఆమె పంచుకున్నారు. రోడ్డుపై శాంతియుతంగా నిలబడినప్పటికీ తనను నిర్బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో భయంతో తన చేతులు వణికాయని ఆమె పేర్కొన్నారు.
రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మహిళా పోలీసులు తనను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యాలను మరో వీడియోలో పంచుకున్నారు. అసలు తనను ఎందుకు అరెస్టు చేశారని ఆమె ప్రశ్నిస్తూ, కేవలం రోడ్డుపై నిలబడినందుకు నిర్బంధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.