ఐఏఎఫ్ పైలట్ అభినందన్ కులం ఏంటి?.. ఇంటర్నెట్ లో తెగ వెతికేసిన భారతీయులు!
- టాప్ ప్లేస్ లో నిలిచిన గుజరాత్
- జాబితాలో తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు
- నిన్న పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్
‘అభినందన్ క్యాస్ట్’ ‘అభినందన్ క్యాస్ట్ జైన్’ ‘ఈజ్ అభినందన్ వర్ధమాన్ జైన్’ ‘వర్ధమాన్ క్యాస్ట్ ఇన్ సౌతిండియా’ అని గుగూల్ లో సెర్చ్ చేశారు. అభినందన్ వర్ధమాన్ కులం గురించి తెగ వెతికిన రాష్ట్రంగా గుజరాత్ తొలిస్థానంలో నిలిచింది. ఆయన కులం గురించి తెలుసుకునేందుకు గుజరాతీ ప్రజలు చాలా ఆసక్తి చూపారు. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.