విజయవాడలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మెడికల్ అకాడమి విద్యార్థి!
- కానూర్ వికాస్ మెడికల్ అకాడమీలో ఘటన
- కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న అకాడమి నిర్వాహకులు
- కార్తీక్ స్వస్థలం కడప జిల్లా రాయచోటి అని వెల్లడి
మరోవైపు ఈ ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. కార్తీక్ స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి అని తెలిపారు. యువకుడి మృతికి కారణమేంటో ఇంకా తమకు తెలియదనీ, దర్యాప్తులో అన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు. కార్తీక్ తల్లిదండ్రులు స్వస్థలం నుంచి విజయవాడకు బయలుదేరారని పేర్కొన్నారు.