మహేశ్ మూవీ విషయంలోను అదే సెంటిమెంట్ తో అనిల్ రావిపూడి
- మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి
- ఇంగ్లిష్ టైటిల్స్ కి ప్రాధాన్యత
- పూర్తి వినోదభరితంగా సాగే కథ
ఇంతవరకూ అనిల్ రావిపూడి తన సినిమాలకి 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్'.. 'ఎఫ్ 2' అంటూ ఇంగ్లిష్ టైటిల్స్ పెడుతూ వచ్చాడు. ఈ సారి మాత్రం తన సినిమాకి తెలుగు టైటిల్ ఉంటుంది అని ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇంగ్లిష్ టైటిల్స్ అచ్చొచ్చాయని అనుకున్నాడో ఏమో, అదే సెంటిమెంట్ తో ఈ సారి కూడా ఇంగ్లిష్ టైటిల్ తోనే సెట్స్ పైకి వెళుతున్నాడని తెలుస్తోంది. మహేశ్ తో సినిమాను ఆయన పూర్తి వినోదభరితంగా రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు.