ఎన్నారై జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు
- రాకేశ్‌తో సంబంధాలున్న పలువురు పోలీసులపై వేటు
- జయరాం హత్య తర్వాత రాయదుర్గం సీఐకు రాకేశ్ ఫోన్
- సీఐపై అధికారుల వేటు.. హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జయరాం హత్యకేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. దర్యాప్తులో రోజుకో విస్తుబోయే నిజం వెల్లడవుతూ వస్తోంది. తాజాగా, ఈ కేసులో రాయదుర్గం సీఐ రాంబాబు పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరాం హత్య తర్వాత రాంబాబుతో రాకేశ్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై వేటేసిన అధికారులు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.