9 ఏళ్ల మేనల్లుడిని తీసుకెళ్లి నిత్యమూ బలవంతం... అత్తపై ఫోక్సో చట్టం కింద కేసు!
Add ap7am to your home Screen

9 ఏళ్ల మేనల్లుడిని తీసుకెళ్లి నిత్యమూ బలవంతం... అత్తపై ఫోక్సో చట్టం కింద కేసు!

  • కేరళలోని మలప్పురంలో ఘటన
  • కామవాంఛలు తీర్చుకునేందుకు చిన్నారికి మాయమాటలు
  • మానసిక స్థితి దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స
అమ్మ పెట్టిన బువ్వ తిని స్కూలుకు వెళ్లి చదువుకోవడం, ఇంటికి వచ్చి ఆడుకోవడం తప్ప మరో ధ్యాస ఉండని తొమ్మిదేళ్ల బాలుడిపై అత్త వరుసయ్యే 36 ఏళ్ల మహిళ అఘాయిత్యానికి పాల్పడింది. కేరళలోని మలప్పురంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి బినూ థామస్ వెల్లడించిన వివరాలు.

ఓ మహిళ కామంతో కళ్లు మూసుకుపోయి, తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఏకంగా ఏడాది పాటు బాలుడిని చిత్ర హింసలు పెట్టింది. బాధిత బాలుడికి అత్త వరుసయ్యే ఆమె, నిత్యమూ మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకునేది. దీంతో చిన్నారి మానసిక పరిస్థితి దెబ్బతినగా, తీవ్ర ఆందోళనతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అక్కడి డాక్టర్ ఆరా తీయడంతో బాలుడు అసలు విషయం చెప్పాడు. ఆ వెంటనే పోలీసులకు, చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కఠినమైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడికి చికిత్స చేయిస్తున్నామని, కేసును విచారిస్తున్నామని బినూ థామస్ వెల్లడించారు.
Kerala
Aunty
Rape
Police
Arrest

More Telugu News