'వాల్మీకి' సినిమాలో ఈషా రెబ్బా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వాల్మీకి' సినిమాలో ఈషా రెబ్బా?

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • ప్రధాన పాత్రల్లో వరుణ్ తేజ్ ..శ్రీ విష్ణు
  • ఆల్రెడీ నానుతోన్న రష్మిక పేరు    
హరీశ్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న 'జిగర్తాండ' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా .. సిద్ధార్థ్ నటించిన ఈ సినిమాను ఇప్పటికీ అక్కడి ప్రేక్షకులు మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉత్సాహంతో హరీశ్ శంకర్ వున్నాడు.

తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం 'వరుణ్ తేజ్' ను ఎంపిక చేసుకున్నాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకిగాను శ్రీవిష్ణును తీసుకున్నాడు. కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్య ఆమె చేసిన 'బ్రాండ్ బాబు' .. 'సుబ్రహ్మణ్య పురం' ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేదు. అలాంటి ఈషా రెబ్బ పేరే గట్టిగా వినిపిస్తోంది. మరి రష్మిక .. ఈషా రెబ్బలలో ఎవరిని అవకాశం వరిస్తుందనేది వేచి చూడాలి. 
varun tej
sri vishnu

More Telugu News