త్రివిక్రమ్ గారిపై నాకు అందుకే కోపం వచ్చింది: క్యారెక్టర్ నటి హేమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ గారిపై నాకు అందుకే కోపం వచ్చింది: క్యారెక్టర్ నటి హేమ

  • త్రివిక్రమ్ గారంటే ఎంతో అభిమానం
  • ఆయన సినిమాలంటే ప్రాణం
  •  ఒక వ్యక్తి ఇదంతా చేశాడు      
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హేమ చేసిన పాత్రలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాంటి హేమ ఈ మధ్యలో త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణమేమిటనే ప్రశ్న, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హేమకి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. " త్రివిక్రమ్ అంటే నాకు ఎంతో అభిమానం .. ఆయన సినిమాలు అంటే ప్రాణం. ఆయన సినిమాకి ప్రాధాన్యతనిస్తూ వేరే సినిమాలను వదులుకున్న సందర్భాలు వున్నాయి. అలా వదులుకున్న విషయం తెలిసి కూడా, నాకు ఒక సినిమాకి చాలా తక్కువ పారితోషికం ఫిక్స్ చేశారు. అందుకు కారణమైన వ్యక్తి ఎవరనేది కూడా నాకు తెలుసు.

ఈ విషయాన్ని త్రివిక్రమ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో నేను హర్ట్ అయ్యాను .. అప్పటి నుంచి ఆయనతో మాట్లాడలేదు. ఆ తరువాత ఒకచోట కలిసినప్పుడు ఒకరినొకరం పలకరించుకున్నాం .. జరిగింది మరిచిపోయాం. మా మధ్య దూరం పెరగడానికి కారణమైన వ్యక్తిని అప్పటికే త్రివిక్రమ్ దూరం పెట్టారు" అని చెప్పుకొచ్చారు. 
trivikram
hema

More Telugu News